అల్ట్రాటెక్ సిమెంట్‌ శుభారంభం ఘనంగా

*అల్ట్రాటెక్ సిమెంట్‌ శుభారంభం ఘనంగా*

-నిజామాబాద్‌లో వినియోగదారుల అవగాహన కార్యక్రమం-

ముఖ్య అతిథి బస్వారెడ్డి (అడ్మిన్) చేతుల మీదుగా ప్రారంభించారు.

నిజామాబాద్‌, నవంబర్‌ 2 ప్రతినిధి (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నగరంలోని టీటీడీ కళ్యాణ పులోంగ్ లో,మండపంలో అల్ట్రాటెక్ ఆదిత్య బిర్లా సిమెంట్ ఆధ్వర్యంలో శుభారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి బస్వారెడ్డి (అడ్మిన్) చేతుల మీదుగా ప్రారంభించారు.

కార్యక్రమంలో వినియోగదారుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. అల్ట్రాటెక్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, అత్యుత్తమ ప్రక్రియ టెక్నాలజీ ద్వారా నాణ్యత, స్థిరత్వం మరియు విశ్వసనీయతను సంస్థ నిర్ధారిస్తోందని తెలిపారు. నాణ్యత నిర్ధారణలో ఆధునిక సాంకేతికతను వినియోగించి, ప్రతి ఉత్పత్తి అత్యుత్తమ ప్రమాణాలను అందుకుంటుందని వారు వివరించారు.

కార్యక్రమంలో సుమారు 500 మంది వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులుగా రాంప్రసాద్ (టి.ఎస్.ఎం), సంతోష్ (మార్కెటింగ్ మేనేజర్), సిద్ధార్థ (టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్), అర్జున్ (టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్), అలాగే విజయ్, ప్రవీణ్, రామారావు, రాజు, నాగేష్, త్రీలోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అల్ట్రాటెక్ సిమెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now