*చిన్నప్పటి నుండే సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసు కోవాలి – ఉమా మహేశ్వరీ.*
ప్రశ్న ఆయుధం, జులై 19, శేరిలింగంపల్లి,ప్రతినిధి
తెలంగాణ లో నిర్వహించే ఆషాడ మాసం భోనాల ఉత్సవాన్ని శనివారం రోజు బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బోనాలతో అమ్మవారి భక్తి పాటలకు ధ్యాన్సులతో, పోతరాజుల వేషాలతో అలరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భోనాలు అని, చిన్నప్పటినుండే వాటి ఔనత్యాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు. చదువు తో పాటు విద్యార్థులకు అన్ని విషయాల్లో కూడా అవగాహనా, అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. టీచర్లు, విద్యార్థులు కల్సి బోనాల ఉత్సవo లో పాల్గొని సందడి చేశారు.
చిన్నప్పటి నుండే సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసు కోవాలి – ఉమా మహేశ్వరీ.*
by Madda Anil
Updated On: July 19, 2025 10:09 pm
