ఘనంగా ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం
– కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గం, 28 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో వెలసిన పురాతన ఆలయం శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్, మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, శ్రీ ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ శ్రీ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ, కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయని, పురాతన ఆలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.