సంగారెడ్డి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘానికి సంబంధించిన నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా పట్లోళ్ల సంగమేశ్వర్, అధ్యక్షుడిగా నాయికవాడి శివకుమార్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా న్యాలకంటి మాణయ్య, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పట్లోళ్ల శివకుమార్, కోశాధికారిగా జె.రాజేశ్వర్ స్వామి, ఉపకోశాధికారిగా పి.చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా పట్నం శెట్టి మల్లేశం,కె. శివకుమార్, పి.జగదీశ్వర్, పి.ప్రభులింగం, గౌలిశ్వర్, పి.సంగన్నలను ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శులుగా శెట్టి మల్లికార్జున్, పి.చంద్రశేఖర్, ఎం. ప్రభు, ఏ.సంగమేశ్వర్ ఎంపికయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా బోడపల్లి అమర్నాథ్, ఎం.బర్తప్ప, బి. బసవరాజ్, కార్యదర్శులుగా బి.సిద్ధప్ప, డి.పవన్ కుమార్ రైకోడ్, ఎస్.సుధాకర్ కల్పగూర్ బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా టీ. మల్లప్ప, కే.కృష్ణమూర్తి, అశోక్, పి. సంగమేశ్వర్ (ఝారసంగం), కోట శ్రీశైలం (నల్లంపల్లి), సుంకరి సిద్ధేశ్వర్ (గోంగ్లూర్) ఎన్నికయ్యారు.క్రమశిక్షణ కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎం.అశోక్ బాబు, వైస్ చైర్మన్లుగా జె. నాగరాజు, గణేష్, పి. మహేష్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా పి.నిర్మల, ప్రధాన కార్యదర్శిగా కె.వీరమణి, ఉపాధ్యక్షురాలిగా వినీత, బి.విజయ (జహీరాబాద్), మహిళ కార్యదర్శులుగా టి.లక్ష్మి, పి.మాలశ్రీ ఎంపికయ్యారు. గౌరవ సలహాదారులుగా తుమ్మలపల్లి పృథ్వీరాజ్, ఎం.ధనంజయ, పి.మల్లికార్జున్ పాటిల్, గోవు రాజు, ముఖ్య సలహాదారులుగా సంగిశెట్టి, గౌరప్ప, పి.బస్వారాజు, జగదీశ్వర్, శరణప్ప, పి.చంద్రప్ప, అశోక్ రాజు పాటిల్, శరణ్ ప్రసాద్ ఎంపికయ్యారు.
సంగారెడ్డి జిల్లా రాష్ట్ర లింగబలిజ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
Published On: November 30, 2025 8:48 pm