బిక్నూర్‌లో 12వ వార్డు సభ్యుడి ఏకగ్రీవo
సన్మానించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబరు 30:
కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్నూర్ గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దీప సరుగు సందీప్ ను, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం సన్మానం చేశారు. తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో సందీప్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిన నేపథ్యంలో అభివృద్ధిని పరిశీలించి ప్రజలు పార్టీకి మరింతగా మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సరుకు చైతన్య, గుండె బాబు, బత్తుల నితిన్, బత్తుల నవీన్ పాల్గొన్నారు.