Headlines :
-
జమ్మికుంటలో రోడ్లపై వాహనాల పార్కింగ్ – అధికారులు నిర్లక్ష్యం
-
వాహనదారులకు ఇబ్బందులు – జమ్మికుంట మున్సిపాలిటీ నిర్లక్ష్యం
-
వాహనాల అదుపు కోసం తక్షణ చర్యలు అవసరం – తెలంగాణ రైతు సంఘం
*పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికార గణం*
*తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాములు*
*జమ్మికుంట అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ లో అడ్డు అదుపు లేకుండా యదేచ్చగా రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, జమ్మికుంట ప్రధాన రహదారిలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద, హోటల్స్ ముందు, వివిధ రకాల షాపుల ముందు పార్కింగ్ కు అనువైన స్థలం లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు రహదారుల పైనే తమ తమ వాహనాలను నిలుపుతున్నారని దీంతో ఆ రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాములు అన్నారు. జమ్మికుంటలో బుధవారం రాములు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట పట్టణానికి వ్యాపార కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉందని నిత్యం వందలాది గ్రామాల ప్రజలు పలు అవసరాల నిమిత్తం జమ్మికుంటకు రాకపోకలు సాగిస్తుంటారని దీంతో జమ్మికుంట పట్టణంలో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని అన్నారు. జమ్మికుంట గాంధీ చౌక్ నుంచి మోత్కులగూడెం చౌరస్తా వరకు వాహనాల రద్దీ మరి ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే రహదారి పక్కన పార్కింగ్ సౌకర్యం లేకుండా నిర్మాణం చేసుకున్న షాపులకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలుపుతుండడంతో ఆ రహదారుల గుండా ప్రయాణం సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మున్సిపల్ అధికారులు రోడ్లపై వాహనాలను నిలుపుతున్న విషయంపై అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో పాటు పోలీస్ అధికారులు సైతం ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేయడంతో వాహనదారులు ఇష్టానుసారం వాహనాలను నడిరోడ్డు పైనే పార్కింగ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు స్పందించి రహదారిపై వాహనాలను పార్కింగ్ చేయకుండా నియంత్రిస్తే ఆ రహదారి గుండా ప్రయాణం సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల పైన వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడాలని కోరారు.