*సాగు యోగ్యం కాని భూములను గుర్తించి గ్రామ సభల్లో ప్రస్తావించాలి*
*జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి*
*హుజురాబాద్ జనవరి 17 ప్రశ్న ఆయుధం*
వ్యవసాయ సాగుకు యోగ్యం కాని భూములను సర్వే చేసి వాటిని గుర్తించి గ్రామ సభల్లో ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయ అధికారి జె భాగ్యలక్ష్మి అన్నారు.శుక్రవారం జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామoలో జరుగుతున్న సాగుకు యోగ్యమైన పంట భూములు, సాగుకు యోగ్యం కానీ భూముల సర్వేని జిల్లా వ్యవసాయ అధికారి జె భాగ్యలక్ష్మి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇల్లు, కాలనీలుగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్ పరిశ్రమలు గోదాములు మైనింగ్ కు ఉపయోగించే భూములు, ప్రభుత్వం సేకరించిన అన్నీ రకాల భూములు, రాళ్లు రప్పలు గుట్టలు చెరువుల్లోని భూములను వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆమె కొరారు.జమ్మికుంట మండలంలోని
మడిపల్లి, బిజిగిరి షరీఫ్, తనుగుల, వావిలాల గ్రామాలలో 4 బృందాలతో సర్వే జరుతున్నదని ఇట్టి క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాగు యోగ్యంకాని భూములను 21 వ తేదీ నుండి జరుగు గ్రామ సభలలో ప్రదర్శించి తీర్మానించడం జరుగుతoదని జమ్మికుంట తహశీల్దార్ రమేష్ బాబు తెలిపారు.శనివారం రోజున క్షేత్ర పరిశీలన జమ్మికుంట, వావిలాల,మడిపల్లి, బిజిగిరీషరీఫ్, తనుగుల గ్రామాలలో క్షేత్ర పరిశీలన కొనసాగుతుoదని మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తహసిల్దార్ రమేష్ బాబు మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ ఆర్ఐ గడ్డం శంకర్ ఏఈఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.