సంగారెడ్డి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆకలితో అలమటిస్తున్న వారికీ ఆకలి తీర్చడంకు మించిన సేవ ఈ లోకంలో మరొకటి లేదని ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎస్.విజయెందర్ రెడ్డి అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాబురావ్ జన్మదిన సందర్బంగా లయన్స్ క్లబ్ అఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో 200 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షడు రామకృష్ణరెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్స్ విజయందర్ రెడ్డి, రామప్ప, లయన్ హన్మంత్ గౌడ్, లయన్ శ్రీనివాస్ గౌడ్, జార్జ్ మ్యాత్యూ, మాణిక్ రావు, శ్రీనివాస్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం
Oplus_0