వై ఆర్ జి కేర్ స్టేట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన 

వై ఆర్ జి కేర్ స్టేట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

IMG 20250311 WA0008

వై ఆర్ జి కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రోగ్రాం మేనేజర్ ప్రభాకర్ నేతృత్వంలో కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, వర్ని మండలాల్లో ఆదివారం ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఆర్ జీకే స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వివిధ మండలాల్లో ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఆదివారం బీర్కూర్, వర్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నందిని కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ కోఆర్డినేటర్

మంటి లింగస్వామి, టీం లీడర్ లీడర్ చందాపురం శ్రీనివాస్ , రమేష్ సతీష్ కర్ణాకర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment