ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – కామారెడ్డి నగర ఏ. బి.వి.పి ఆధ్వర్యంలో 

*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*

– కామారెడ్డి నగర ఏ. బి.వి.పి ఆధ్వర్యంలో

కామారెడ్డి జిల్లా జనవరి 26 ప్రశ్నయుధం వార్త ప్రతినిధి :

ఏ. బి.వి.పి కామారెడ్డి నగర అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అనిల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. .జిల్లా ప్రజలకు మరియు విద్యార్థుల కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేసారు.మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని,విద్యార్థులు తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి దేశం కి మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో ఏ.బి.వి.పి జిల్లా కన్వీనర్ రోహిత్, ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర పూర్వ శ్రీ రణజిత్ మోహన్ , పూర్వ కార్యకర్తలు రాజా గౌడ్, నరేష్, మహేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.. నాయకులు,తదితరులు పాల్గొన్నారు………

Join WhatsApp

Join Now

Leave a Comment