గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతు సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో డి ఎల్ పి ఓ కు వినతిపత్రం అందజేత ..
గ్రామపంచాయతి కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రం లొని ఎంపి డి ఓ కార్యాలయం లో డి ఎల్ పి ఓ నాగరాజ్ కు గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతు వినతిపత్రం అందజేశారు.ఈ నేల 15 న స్వతంత్ర దినోత్సవ న్ని పురస్కరించుకొని ప్రతి కార్మికులకు యూనిపం అందజేయ్యాలని, శానిటేషన్ పరికరాలు సరఫరా చెయ్యాలని కోరుతు డి ఎల్ పి ఓ నాగరాజ్ కు సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయ్యగా సానుకూలంగా స్పందించిన డి ఎల్ పి ఓ పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వారం రోజుల్లో అందెల చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో మండల అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శి రూప్ సింగ్, ఉపాధ్యక్షులు భూమయ్య, సహాయ కార్యదర్శి సుశీల బాయి, శంకర్, గంగారాం, పురేందర్, సాయిలు, గంగ బోయి, గంగవ్వ, చంద్రవ్వ, పూలన్ బాయి తదితరులు పాల్గొన్నారు.