Headline
వినియోగదారుల హక్కుల గురించి మీకు తెలుసా..?
వస్తుసేవల పరిహారాన్ని ఎలా పొందాలి..?
ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినప్పుడు అయినా వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా సేకరించాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఇన్వాయిస్, ఇతర బిల్లులను చూపించాల్సి ఉంటుంది.
వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-2019ను ప్రభుత్వం రూపొందించింది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినప్పుడు అయినా వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా సేకరించాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఇన్వాయిస్, ఇతర బిల్లులను చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తుసేవల్లో లోపాలు ఉన్నప్పుడు పరిహారాన్ని కోరే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. వీటితో పాటు వినియోగదారులు తమ హక్కులకు సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన పెంచుకోవాలి.
వినియోగదారులు అంటే ఎవరు..?
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్- 2019 ప్రకారం.. అవసరాల కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసేవారిని కన్స్యూమర్స్ లేదా వినియోగదారులు అంటారు. వస్తుసేవల కోసం ఎలక్ట్రానిక్ విధానం, టెలిషాపింగ్, డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవల్ మార్కెటింగ్.. వంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో లావాదేవీలు చేయవచ్చు.
వినియోగదారులు కానివారు ఎవరు..?
వస్తువులను తిరిగి అమ్మడానికి లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం కొనుగోలు చేసేవారు వినియోగదారులు కాదు.
వినియోగదారుల హక్కులు అంటే ఏంటి..?
వస్తుసేవల గురించి పూర్తి సమాచారం పొందే హక్కు, వస్తుసేవల నాణ్యతకు భరోసా ఇచ్చే హక్కు, సమస్యలకు పరిష్కారాన్ని కోరే హక్కు, వినియోగదారుల విద్యా హక్కు, జీవితానికి హాని కలిగించే వస్తుసేవల నుంచి రక్షణ పొందే హక్కు… వంటివన్నీ కన్స్యూమర్ రైట్స్‌లో భాగంగా ఉంటాయి.
వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు..?
వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం మూడంచెల చట్టపరమైన వ్యవస్థ అందుబాటులో ఉంది.
రూ.1 కోటికి తక్కువగా ఉండే లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులను విచారించే అధికారం జిల్లా కమిషన్‌కు ఉంటుంది.
రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు విలువ ఉండే లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను స్టేట్ కమిషన్ విచారిస్తుంది.
రూ.10 కోట్లకు మించి ఉండే లావాదేవీల ఫిర్యాదులను జాతీయ వినియోగదారుల కమిషన్ పరిష్కరిస్తుంది.
వినియోగదారుల సమాచార హక్కు అంటే ఏంటి..?
ఒక వ్యక్తికి తాను సొంతం చేసుకున్న వస్తుసేవలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే హక్కు ఉంటుంది. దీన్నే వినియోగదారుల సమాచార హక్కు అంటారు.
వినియోగదారులకు పరిహారం పొందే హక్కు ఉంటుందా..?
కొన్నిసార్లు వస్తుసేవల వల్ల వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు డ్యామేజీ స్థాయిని బట్టి నష్టపరిహారం పొందే హక్కు వారికి ఉంటుంది.
ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ అంటే..?
ఉత్పత్తుల విషయంలో వినియోగదారుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను సంస్థలు అభివృద్ధి చేయాలి. దీన్ని ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ అంటారు.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ఎలా పనిచేస్తుంది…?
కేసులు దాఖలు చేసే విధానం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం, వారికి కోర్టుల్లో ప్రాతినిధ్యం కల్పించడం, అవగాహన కల్పించడం.. వంటి బాధ్యతలను కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తుసేవల వల్ల కలిగే డ్యామేజీకి పరిహారాన్ని కోరవచ్చు. పలువురు మేధావులు వాపోతున్నారు