జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారానికి ఊహించని ప్రజా స్పందన
ఎర్రగడ్డలో పలు డివిజన్‌లలో మహమ్మద్ అలీ షబ్బీర్, అది శ్రీనివాస్ కలిసి ప్రచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
హైదరాబాద్, అక్టోబర్ 31: జూబ్లీహిల్స్ నియోజకవర్గ బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎర్రగడ్డ పరిధిలోని పలు డివిజన్‌లలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొని జనం మధ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందన్నారు నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి, నవీన్ యాదవ్ గెలిపించి తమ నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.