కామారెడ్డిలో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక దుకాణాల తనిఖీలు
ఉల్లంఘనలు గుర్తించిన అధికారుల బృందం
దుకాణదారులకు మెరుగుదల నోటీసులు జారీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15
కామారెడ్డి పట్టణంలో ఆహార భద్రత నియోజిత అధికారి బి. శిరీష, ఆహార భద్రత అధికారి జి. విక్రమ్ కలిసి శనివారం పలు ఆహార దుకాణాలు, బేకరీలు మరియు కిరాణా షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశీలనలో ప్యాకేజింగ్, శుభ్రత, నిల్వ ప్రమాణాలు, గడువు తేదీల నిర్వహణలో కొన్ని ఉల్లంఘనలు గుర్తించారు. దీనితో సంబంధిత వ్యాపారులకు మెరుగుదల నోటీసులు జారీ చేసి, నిర్ణీత సమయానికి లోపాలు సరిచేయాలని ఆదేశించారు. అదనంగా, ఫుడ్ లేబులింగ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.