పశువుల పాకను ధ్వంసంచేసిన గుర్తుతెలియని వ్యక్తులు
*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 20, ప్రశ్న ఆయుధం
గుర్తుతెలియని వ్యక్తులు పశువుల పాకను ధ్వంసం చేసిన సంఘటన గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో శుక్రవారం జరిగింది. బాదిత రైతు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన రాజాగౌడ్ రైతు వ్యవసాయ పొలం వద్ద ఏర్పాటు చేసుకోగా గుర్తుతెలియ వ్యక్తులు వచ్చి పశువుల పాకం ధ్వంసం చేశారు. సుమారు రెండు లక్షల రూపాయల విలువచేసే పశువులపాక ధ్వంసం కావడంతో భాదిత రైతు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.