అంగన్వాడి విద్యార్థులకు యూనిఫాంలు..1

అంగన్వాడి

త్వరలో అంగన్వాడి విద్యార్థులకు యూనిఫాంలు..

 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల్లో ఫ్రీ ప్రైమరీ చదువుకుంటున్న చిన్నారులకు యూనిఫామ్ అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది, ఒక్కొక్క చిన్నారికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసింది,ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్య సించే విద్యార్థులకు యూనిఫాం అందిస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే యూనిఫాం పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 823 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 7,482 మంది చిన్నారులను అధికారులు గుర్తించారు. వీరిలో 3,778 మంది బాలురు, 3,855 మంది బాలికలు ఉన్నారు. మలి విడతలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారులం దరికీ ప్రభుత్వం యూనిఫాం అందజేయనుంది. త్వరలోనే యూనిఫాం దుస్తుల్లో చిన్నారులు సందడి చేయనున్నారు. యూనిఫాంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూడా కనిపించనున్నారు. ఇందుకు అవసరమైన వస్త్రాన్ని ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపించింది. దస్త్రాన్ని మహిళా సంఘాల సభ్యులు కుడుతున్నారు. మరికొద్ది రోజులోనే సీఎం రేవంత్ రెడ్డి.మంత్రుల నేతృత్వంలో లాంఛనంగా యూనిఫాం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Join WhatsApp

Join Now