కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిల్చింది

కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది ప్రజలకు తీవ్ర నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్ కాక రమేష్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి మొండిచేయి చూపుతూ తీవ్ర నిరాశకు గురిచేసిందని అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాక రమేష్ అన్నారు. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణా ప్రజలను నిరాశపరిచిందని, బడ్జెట్ పట్ల అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు అసంతృప్తి చెందారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండు గంటల ప్రసంగంలో తెలంగాణా ఊసే ఎత్తలేదని కాక రమేష్ తెలిపారు. తెలంగాణాకు హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి హామీల అమలుకు నిధులు కేటాయించపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలియచేస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీయే పక్షాలకు వరాల జల్లు కురిపిస్తూ నిధులు కేటాయించడం, ఎన్డీయే ఇతర ప్రతిపక్షాల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి, నిధులు మంజూరు చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని కాక రమేష్ అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాని మోడీకి తెలంగాణాపై ఉన్న ద్వేషానికి, రాష్ట్ర అభివృద్ది పట్ల వారికున్న నిర్లక్ష్య వైఖరికి తార్కాణం అని తెలియచేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దేశ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసి పెద్దన్న పాత్ర పోషించాల్సింది మరచి బడ్జెట్ లో తెలంగాణాకు మొండిచేయి చూపి, నిధులు కేటాయించనందుకు తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలనీ లేనిపక్షంలో ప్రత్యేక నిధులు మంజూరు చేపించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి యువ నాయకులు కాక రమేష్.

Join WhatsApp

Join Now