*పెద్దమ్మ గుడి వద్ద బోర్ వేసిన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్*
*బిజెపి యువ నాయకుడు మట్ట పవన్ రెడ్డి*
*జమ్మికుంట/ ఇల్లందకుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని బిజెపి యువ నాయకుడు మట్ట పవన్ రెడ్డి అన్నారు ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో వున్న పెద్దమ్మ గుడి వద్ద భక్తుల సౌకర్యార్థం బోర్ కావాలని కనగర్తి గ్రామానికి చెందిన బిజెపి యువ నాయకుడు మట్ట పవన్ రెడ్డి వారం రోజుల క్రితం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి తన ఎంపీ నిధులతో బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు గురువారం రోజున కనగర్తి గ్రామానికి బోర్ పంపించగా సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి దగ్గర వుండి గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద బోర్ వేయించగా బోర్ సక్సెస్ కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. బోర్ వేయించిన బండి సంజయ్ కుమార్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు పవన్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల కోసం పనిచేసే బండి సంజయ్ కుమార్ సహకారంతో గ్రామంలో మరింత అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు పవన్ రెడ్డి కేంద్రమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి బండి సాంబరాజు బండి రాజు మట్ట బాల్ రెడ్డి దేవునూరి రాజు కాంతోడి శివ బచ్చల రాజమహేందర్ ఇరబోయిన సతీష్ మాడీజోడి రవీందర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు