*ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు*
*కేంద్రమంత్రి బండి సంజయ్ యువతకు ఆదర్శం*
*బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి*
*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 11 ప్రశ్న ఆయుధం*
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో గల గరుడ చౌరస్తాలో కేక్ కట్ చేసి కేకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన అయన జీవితం, నేటి యువతకు కార్యకర్తలకు ఆదర్శమని కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందని రాబోవు రోజుల్లో బండి సంజయ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ ప్రాంత ప్రజల ఆశాభావం అని పేర్కొన్నారు కార్యకర్తకు భరోసా కల్పించడంలో బండి సంజయ్ కుమార్ ముందుంటున్నారని అటు కేంద్రమంత్రిగా ఇటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా సక్రమంగా బాధ్యతను నిర్వహిస్తూ గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. బండి సంజయ్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం గొప్ప మనస్తత్వానికి నిదర్శనమని బండి సంజయ్ కుమార్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త పని చేస్తే కచ్చితంగా రానున్న కాలంలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, ఆరెల్లి శ్రీనివాస్,అబ్బిడి తిరుపతి రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి,ఎండీ షఫీ,గురుకుంట్ల సాంబయ్య, నల్ల లింగారెడ్డి, బొమ్మాడి శ్రీధర్,మట్ట పవన్ రెడ్డి,తాళ్ల పాపిరెడ్డి, మురహరి గోపాల్, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్,ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య, బక్కతట్ల రాకేష్,ఇరువాల రమేష్, చిట్ల శ్రీనివాస్, కోడం భరత్, చిప్పతి శ్రీకాంత్,శీలం సాయిప్రసాద్ రెడ్డి, భద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు