అన్నదాతల సాగునీటి సమస్యను పరిష్కరించిన బండి సంజయ్ కేంద్రమంత్రి

*అన్నదాతల సాగునీటి కష్టాల సమస్యను పరిష్కరించిన -కేంద్ర మంత్రి బండి సంజయ్*

 

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం అక్టోబర్ 8*

 

కరీంనగర్ ఎస్సారెస్పీ డి -94 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక రైతులు మంగళవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించారు డి -94 కాలువకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ తెలుసుకొని ఆయకట్టు రైతులకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులకు సూచించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సొంత ఖర్చులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లను తొలగించే పనులను చేయుటకు బిజెపి నేతలు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మాడిశెట్టి సంతోష్ కుమార్ పాదం శివరాజ్ అనుముల మహేందర్ పురమాయించగా వెంటనే జెసిబి సహాయంతో పనులు ముమ్మరం చేసి కాలువలోని చెత్తను చెట్లను తొలగించారు బిజెపి నేతలు మాట్లాడుతూ కొత్తపళ్లి మండలం మల్కాపూర్ నుంచి వచ్చే డి -94 కాలువ రేకుర్తి సీతారాంపూర్ ఆరేపల్లి తీగల గుట్టపల్లి మీదుగా రూరల్ మండల పరిధిలోని 5వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు అయితే అనేక ప్రాంతాల నుంచి మురికి నీరు వచ్చి కాలువల్లో చేరి చెత్త చెదారంతో నిండిపోయే పరిస్థితి వచ్చిందని, పైగా కాలువల్లో అనేక రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో రైతులకుసాగు నీరు అందలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మురికి నీరు వల్ల కొంతమంది రైతుల పంటలు దెబ్బతింటున్నాయని మరికొందరికి సాగునీరు అందడం లేదని ఇరిగేషన్ అధికారులకు, కరీంనగర్ నగరపాలక సంస్థల అధికారులకు రైతులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించి స్వంత ఖర్చులతో కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాతల నీటి కష్టాల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపిన బండి సంజయ్ కుమార్ స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు బిజెపి నాయకులు రైతులు పెంటల నారాయణ మెండే కనకయ్య పెంటల నాంపెల్లి యుగంధర్ రెడ్డి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now