బిజెపి నాయకుడు తోట సాగర్ కు అనారోగ్యం
ఫోనులో పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ సెప్టెంబరు1 ప్రశ్న ఆయుధం
బిజెపి నాయకుడు కరీంనగర్ ఏడవ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ తోట సాగర్ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ తో అనారోగ్య బారిన పడ్డారు కరీంనగర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవసరమైన వైద్య పరీక్షలను చేపట్టి తోట సాగర్ కు స్టంట్ వేశారు విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తోట సాగర్ అనారోగ్య విషయం ఫోన్లో మాట్లాడి ఆందోళన చెందవద్దని , ధైర్యంగా ఉండాలని నేనున్నాననే భరోసాను తోట సాగర్ కు కల్పించారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడి తోట సాగర్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.