*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైభవ గీతంను క్లాప్ కొట్టి ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్*
*కరీంనగర్ జూలై 18 ప్రశ్న ఆయుధం*
సినీ గేయ రచయిత గుండేటి రమేష్ రచన, గానం, దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న “ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైభవ గీతం ను శుక్రవారం రోజున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు అనంతరం దర్శకులు గుండేటి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ వైభవ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 2న గుండేటి మ్యూజిక్, మూవీస్ ద్వారా ఆల్బమ్ రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, డాక్టర్ పి కిషన్, డైరెక్టర్ అక్కెన భాస్కర్, కొరియోగ్రాఫర్ శ్రీనివాస్ కార్పొరేటర్ బండరమణ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, దుబాయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.