*ఉపాధి కూలీల మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి.
*సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్*
*అన్ని విధాలా ఆదుకోవాలని కోరిన కేంద్ర మంత్రి*
*ఆర్ధిక సాయం, ఉద్యోగం ఇస్తామని వెల్లడించిన కలెక్టర్*
*కరీంనగర్ జనవరి 30 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు మీద పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫోన్ ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందిస్తామని, దీంతోపాటు మృతులు మహిళా పొదుపు సంఘాల్లో కొనసాగుతున్నందున మరో రూ.10 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతోపాటు ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు