బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లిని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

*బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లిని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*

*జమ్మికుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*

బిజెపి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మికుంట పట్టణానికి చెందిన ఆకుల రాజేందర్ తల్లి కి శనివారం నాడు హార్ట్ స్ట్రోక్ రావడం వలన కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విషయం తెలుసుకొని హాస్పిటల్కు వెళ్లి ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించి ఆమెకు తగు సూచనలు చేశారు చలి తీరుతా తీవ్రంగా ఉన్నందున హార్ట్ ఎటాక్ తరచుగా వస్తాయని వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వెంట బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలగాని రాజు, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, ఓబీసీ మూర్చ మండల అధ్యక్షుడు దొంతరవీణ రమేష్ యాదవ్, నాయకులు పొన్నగంటి రవి, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, బొజ్జ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now