బీసీ విద్యార్థులకు అన్యాయం

బీసీ విద్యార్థులకు అన్యాయం

 

 

– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 19

 

పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీసీ విద్యార్థులకు షరతులు విధించడం అన్యాయం అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. శనివారం

కామారెడ్జిడి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీల నాగరాజు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీ లకు రిజర్వేషన్లు కల్పించకపోవడంతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీసీ విద్యార్థులకు షరతులు విధించడం అన్యాయం అని అన్నారు. బీసీ విద్యార్థులకు పది వేల ర్యాంక్ లోపలే వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పూర్తిగా ఇవ్వక కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం సరి కాదన్నారు. అదే విధంగా స్కాలర్షిప్పు,ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అర్హులైన విద్యార్థులు అందరూ ఈడబ్ల్యూఎస్ వలన నష్టపోతున్నారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీవాళ్లకు అత్యల్ప కటాఫ్ మార్కులు 564 కాగా అదే మార్కులు వచ్చిన బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల విద్యార్థులకు సీట్లు రాని పరిస్థితి ఉందన్నారు.కావున ఈ అగ్ర వర్ణాల రిజర్వేషన్ విషయంలో సమీక్ష జరిపి ఆర్థిక వెనుకబాటుదల మీద ఆధారపడుతున్నదా లేక మరో రకమైన సామాజిక అన్యాయానికి దారి తీస్తుందా అని ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, నర్సింలు, మోహాన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment