*జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని డాక్టర్లు*

*జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని డాక్టర్లు*

*పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి కానీ చికిత్స అందించడానికి డాక్టర్లు కరువు..*

*అనారోగ్యంతో బాధపడి చికిత్స కోసం వస్తే ప్రతి రోగానికి పారాసెటమాల్, డైక్లో, గోలిల్ మాత్రమే*

*ఉదయం 9 గంటలకు op ప్రారంభిస్తే 11 గంటల వరకు రాని డాక్టర్లు*

*ఈ వ్యవహారాలు అన్ని ఆసుపత్రి సూపరిండెంట్ కి తెలిసినా, చర్యలు శూన్యం*

జహీరాబాద్, ఆగస్టు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 100 పడకుల ప్రభుత్వ ఆసుపత్రి జహీరాబాద్ డివిజన్ లోనే అతిపెద్ద ఆసుపత్రిగా గుర్తింపు ఉన్న ఆసుపత్రి. కానీ ఇక్కడ చూసుకుంటే వైద్యం మాత్రం శూన్యం.. ఎప్పుడు కూడా సమయానికి డాక్టర్లు వచ్చిన పాపాన పోలేదు. డ్యూటీ ఒకరిది కానీ వారు బయట వాళ్లను తీసుకొని వచ్చి ఇక్కడ చికిత్స చేయిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆసుపత్రి సూపరిండెంట్ దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళినా.. నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ ఎవరిది.. ఎవరు.. చేయాలి.. ఎలాంటి క్రమశిక్షణ లేక అనేక రోగులు బాధపడుతున్నారు.. చిన్నచిన్న గాయాలు పడి ఆసుపత్రికి చికిత్స కోసం వస్తే వాళ్లను కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళండి అని ఉచిత సలహాలు ఇచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది ఇలాగే ఉంటే జహీరాబాద్ లో ఒకేషనల్ కాలేజ్ స్టూడెంట్లు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ, ట్రైనింగ్ పై ఉన్న విద్యార్థులపై పూర్తిస్థాయిలో భారం మోసి ప్రభుత్వ ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉన్న వాళ్లు కూర్చుంటున్నారు. దీనిపై జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారులు స్పందించి ఆసుపత్రిలో విచారించి, తక్షణమే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని సక్రమంగా వైద్యాన్ని అందించాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now