ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 25, (ప్రశ్న ఆయుధం):
ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి కేంద్రంలోని భాజాపా పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. మహనీయుని చిత్రపటానికి వివిధ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ – “దీనదయాల్ ఉపాధ్యాయ గారు సమాజంలోని చివరి అంచున ఉన్నవారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు. ఆయన చూపిన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ మార్గం మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఆయన ఆలోచనలు ఈ తరం యువతకు దారిదీపం” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, మండల అధ్యక్షులు పెద్దెడ్ల నర్సింలు, పట్టణ అధ్యక్షులు అగల్ దివిటీ రాజేష్, ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీను, మాజీ మండల అధ్యక్షులు S.N. రెడ్డి, ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి, కోశాధికారి గజనాన్ తదితరులు పాల్గొన్నారు.