Headlines
-
ఉప్పల్ శిల్పారామం వేదికగా శ్రీకృష్ణ పారిజాతం నృత్య ప్రదర్శన
-
కూచిపూడి కళారూపానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు: డాక్టర్ శుభ మార్వాడ
-
సత్యభామ, రుక్మిణి పాత్రలతో నాట్యకారులు ప్రేక్షకులను అలరించారు
-
సాంస్కృతిక వారసత్వానికి మినీ శిల్పారామం వేదిక
మేడ్చల్ జిల్లా
ఉప్పల్ మినీ శిల్పారామం లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గల మేరీల్యాండ్ రాష్ట్ర కేంద్రంగా ప్రముఖ నాట్య గురువు డాక్టర్ శుభ మార్వాడ ప్రణవ నాట్యం సంస్థ ను ఏర్పరచి ఎంతోమంది కూచిపూడి కళాకారులను తీర్చి దిద్దారు . ఆ శిష్యులతో శనివారం మినీ శిల్పారామం ఉప్పల్ యందు “శ్రీ కృష్ణ పారిజాతం” నృత్య ప్రదర్శన ఇచ్చారు. శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చిన నారదుడు రుక్మిణి దేవి కి పారిజాత పుష్పాన్ని ఇస్తాడు ఆ విషయం తెలిసి సత్యభామ అలుగుతుంది.అపుడు శ్రీకృష్ణుడు ఏకంగా పారిజాత చెట్టు నీ తీసుకొచ్చి సత్యభామ పెరట్లో నాటుతాడు. ఆ పుష్పాలు రుక్మిణి దేవి పెరట్లో వాలడం ఇద్దరికీ గొడవ జరగడం , సత్యభామ అహంకారాన్ని వీడి తప్పులు తెలుసుకొని కృష్ణుడిని వేడుకోవడం ఈ ఘట్టాలను కళాకారులూ ప్రనూష రెడ్డి, అంబికా శ్రీ, ప్రణవి, సంధ్య, నర్తించారు.గురువు గారు డాక్టర్ శుభ మార్వాడ నట్టువాంగం, పై సహకరించారు