క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,
మేడ్చల్ జిల్లా ప్రతినిధి/ ఉప్పల్
డిసెంబర్ 21(ప్రశ్న ఆయుధం )
రామంతపూర్ లోని అవే మరియా స్కూల్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు. శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తం చిందించిన ధీశాలి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని ఉప్పల్ ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, స్కూల్ యాజమన్యం BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.