ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఆహ్వాన పత్రిక అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23 – 02 – 2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు రేబల్లి శ్రీనివాస్, రేబల్లి నరేందర్,వంగపల్లి ప్రభాకర్, అల్లాడి ప్రభాకర్,సముద్రాల శ్రీనివాస్,బాల వీరేశం తదితరులు పాల్గొన్నారు