Headlines :
-
ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారం
-
3500 యూనిట్ల రక్తాన్ని అందజేసినందుకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
-
తలసేమియా చిన్నారుల కోసం భారతదేశంలో అత్యధిక రక్త సేకరణ
-
భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని డాక్టర్ బాలు పేర్కొన్నారు
-
రక్త దానానికి సహకరించిన రక్తదాతలకు కృతజ్ఞతలు
-తలసేమియా చిన్నారులకు 3500 యూనిట్ల రక్తాన్ని
అందజేసినందుకు పురస్కారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),కామారెడ్డి రక్తదాతల సమూహం ల ఆధ్వర్యంలో 2023,2024 సంవత్సరాలలో తులసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 3500 యూనిట్లపైగా రక్తాన్ని అందజేసినందుకు గాను తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్,ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు అందజేసిన పురస్కారాన్ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అందజేయడం జరిగింది.భారతదేశంలోని ఒక సంవత్సర కాలంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం సేకరించినందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం లకు గుర్తింపును దక్కించుకోవడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ భవిష్యత్తులో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేయడానికి కావలసిన రక్తదాన శిబిరాల నిర్వహణకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాల నిర్వహించి తలసేమియా చిన్నారులకు ప్రాణాల కాపాడుతామని అన్నారు.రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు,సహకరిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు.