*యూపీఎస్పీ సివిల్స్ ఫలితాలు*
*హైదరాబాద్: ఏప్రిల్ 22*
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సివిల్ సర్వీసులు సాధించాలని యువత కలలుకంటుం టారు. ప్రతీయేటా వేలాది మంది సివిల్స్ కోసం పోటీపడుతుంటారు.
గత సంవత్సరం సివిల్స్ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), వివిధ గ్రూప్ ‘A’, గ్రూప్ ‘B’ సెంట్రల్ సర్వీసెస్ లకు నియామకాలకు మొత్తం 1,009 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
శక్తి దూబే ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇ. సాయి శివాని 11, బన్నా వెంకటేశ్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62 , సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతన్ రెడ్డి 110, చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకులతో సత్తాచాటారు.
UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024 జూన్ 16న జరిగింది. ఆ తర్వాత మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 29, 2024 మధ్య నిర్వహించా రు.
చివరి దశ, ఇంటర్వ్యూ రౌండ్, జనవరి 7 నుంచి ఏప్రిల్ 17, 2025 వరకు జరిగింది. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2024 రాసిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తుది ఫలితా లను చూసుకోవచ్చు.