ఐ ఎం ఈ ఏ నెంబర్ ఆధారంగా పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేసిన పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్

*ఐ ఎం ఈ ఏ నెంబర్ ఆధారంగా పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేసిన పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్*

*జమ్మికుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*

బుధవారం రోజున ఆకుల సదానందం అనే వ్యక్తి జమ్మికుంట పట్టణంలో పోగొట్టుకున్న తన వన్ ప్లస్ మొబైల్ ఫోన్, కోడిపాక సురేష్ అనే వ్యక్తి జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో తన రెడ్మీ 9 ప్రో మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేయగా జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ వారి మొబైల్ ఫోన్ల ఐఎంఈఏ నంబర్ ద్వారా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారి యొక్క మొబైల్ ఫోన్ లని పట్టుకొని బాధితులకి అందజేశారు అనంతరం సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా తన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నప్పుడు వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో అప్లోడ్ చేయించుకోవాలని జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ సుధగాని రామకృష్ణ గౌడ్ సూచించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పట్టుకొని బాధితులకు అందజేయడంతో సీఐ రామకృష్ణ గౌడ్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment