*పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులకు అందజేసిన పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ*
*జమ్మికుంట జులై 4 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామానికి చెందిన పర్ల పెళ్లి కవిత తన మొబైల్ ను నెలరోజుల క్రితం పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ సంప్రదించగా పోలీసులు మొబైల్ యొక్క ఐ ఎం ఈ ఏ ఆధారంగా సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను పట్టుకొని బాధితురాలైన పర్లపెల్లి కవిత భర్త శ్రీనివాస్ లకు జమ్మికుంట పట్టణ సిఐ ఎస్ రామకృష్ణ శుక్రవారం రోజున అందజేశారు పట్టణంలో మండలంలో ఎవరైనా తమ మొబైల్ ఫోను పోగొట్టుకున్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో అప్లోడ్ చేసుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు పోగొట్టుకున్న మొబైల్ దొరకడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు