ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షా నిర్వహించిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.. 

ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షా నిర్వహించిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

నిజామాబాద్ ప్రశ్న ఆయుధం జిల్లా ప్రతినిధి జనవరి04

నిజామాబాద్ సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి అధికారులతో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సమీక్షా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నగరంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులపైన అధికారులతో చర్చించి తగు సూచనలు తెలుపడం జరిగింది.

నాగారం మరియు కలెక్టరేట్ బైపాస్ లో నిర్మించిన 648 డబుల్ బెడ్ రూమ్ ల మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం నుండి విడుదల అయినా 1.25 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బ్లాక్ వైస్ విభజించి వీలైనంత త్వరగా మరమ్మతులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలనీ సూచించారు.

నగరంలో వర్ని రోడ్ నుండి నాగారం వరకు,బస్వాగార్డెన్ రోడ్,రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి దత్తాత్రేయ గుడి వరకు మంజురైనా నాలుగు రోడ్ల నిర్మాణం, దత్తాత్రేయ గుడి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలనీ పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలనీ సూచించారు.

నగరంలో రోడ్ మరమ్మతులు జరగడం లేదని గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు, నగరంలో గుంతలు పుడ్చాలని అదేశించారు.

Join WhatsApp

Join Now