నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 09:
నిజామాబాద్ లో గోపాల్ బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి మహోత్సవం కార్యక్రమానికి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సకల దేవతలు నిలయమై ఉండే గోమాతను పూజించే గొప్ప సంస్కృతి మన హిందూ ధర్మంలో అది భారతదేశంలోనే ఉందని అన్నారు. ఒకప్పుడు ఇంటికో గోమాత ఉండేదని ఇప్పుడు గోవులు అంతరించిపోతున్నాయని గోవులను పెంచే బాధ్యత రక్షించాల్సిన బాధ్యత, హిందువులుగా అందరిపైన ఉంటుందని అన్నారు.
గోవు ఇంట్లో ఉండటం వల్ల కుటుంభం రోగాల బారిన పడకుండా ఉంటుందని, గో మూత్రంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తల్లి పాలకు సమానమైన ఆవు పాలు ఎంతో శ్రేష్ఠకరమైనవి అని అన్నారు… గోవులకు ఆక్సిడెంట్ అయినా లేదా అనారోగ్య సమస్య వచ్చిన ఉచితంగా తన ట్రస్ట్ ధ్వరా వాహన సర్వీస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం గోమాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిసినల్ కలెక్టర్ కిరణ్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకట్ రెడ్డి, గోపాల్ బాగ్ గోశాల కమిటీ అధ్యక్షులు కోలా రామ్, కార్యదర్శి మాస్టర్ శంకర్, కమల్ ఇనాని, క్యాషియర్ ధన్పాల్ శ్రీనివాస్, ట్రస్టీ కైలాస్ బోయంకర్, తదితరులు పాల్గొన్నారు.