Site icon PRASHNA AYUDHAM

రేవంత్ దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర చేయాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

హైదరాబాద్ లో ఇళ్ళు కూల్చి నల్గొండ నుండి రేవంత్ పాదయాత్ర చేయడం విడ్డురంగా ఉందన్నారు.

రేవంత్ సర్కార్ కు దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర చేయాలనీ డిమాండ్ చేసారు.

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 08:

ఈ రోజు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ మొదలు పెట్టిన మూసి పరివాహక పాదయాత్రపై స్పందించిన నిజామాబాదు *అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు* మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ పుట్టినరోజు సందర్బంగా ఈ ఒక్క రోజైన అయినా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోయేలా ఏదైనా ఉపయోగపడె మంచి పని చేస్తారని భావిస్తే, మూసి పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేసే అబద్దపు ప్రచారానికి శ్రీకారం చుట్టరన్నారు

ఆరు గ్యారంటీలు అమలు చేసారని పాదయాత్ర చేస్తున్నారా… రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసారని పాదయాత్ర చేస్తున్నారా… మహిళలకు 2500 ఇచ్చారని పాదయాత్ర చేస్తున్నారా… ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని పాదయాత్ర చేస్తున్నారా అని ఏద్దేవా చేసారు. మూసి పరివాహక ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న పేదోళ్ల ఇళ్లను హైదరాబాద్ లో కూల్చి…. నల్గొండలో పాదయాత్ర చేసి ఎవరిని ఓదార్చుతారు అని ఏద్దేవా చేసారు. దమ్ముంటే రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో కూల్చిన ఇళ్ళ దగ్గర నుండి పాదయాత్ర మొదలు పెట్టలని డిమాండ్ చేసారు.

హైదరాబాద్ మూసి ప్రజలు పూలతో స్వాగతం పలుకుతారో… చెప్పులతో చీపీర్లతో స్వాగతం పలుకుతారో ప్రభుత్వానికి తెలిసోస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్లకు అనుమతులు ఇచ్చి, కరెంటు బిల్లు, ఇండ్ల బిల్లు అన్ని రకాల బిల్లులు కట్టించుకొని ఇప్పుడు అవి అక్రమాలు అని కూల్చడం దుర్మార్గం అన్నారు. అసలు మూసి మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల మీ కాంగ్రెస్ పాలన కాదా అని రేవంత్ ను ప్రశ్నించారు.

మూసి ప్రక్షాళనకు బిజెపి నాయకులు వ్యతిరేకం కాదని ప్రక్షాళనతో పేదల ఇళ్ళు కూల్చాడానికి వ్యతిరేకం అని ప్రక్షాళనతో మీరు లక్ష కోట్లు దోచుకుంటాం అంటే దానికి మేము వ్యతిరేకం అని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని పరిపాలన చేయాలనీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలనీ, రైతు రుణమాఫీ, రైతుల హామీలను పూర్తిగా చేయాలనీ అన్నారు.

Exit mobile version