కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి -అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 13:

నిజామాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కింద లక్షనూటపాదహారు రూపాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని సంవత్సరం కాలం గడుస్తున్న తులం బంగారానికి మోక్షం కలుగలేదని ఏద్దేవా చేసారు.

IMG 20241213 WA0222

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని వారి ఆశలు ఆడిఆశలుగా మారుతున్నాయి కాని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు అన్నారు. కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాల పేరుతో ప్రజా ధనం వృధా చేయడం తప్ప రాష్ట్రానికి ఒరగపెట్టింది ఏమి లేదని అన్నారు. కల్యాణ లక్ష్మీ/షాది ముబారక్ తో తులం బంగారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు.

చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదు అని అప్లై చేసుకున్న రెండు నెలల కాలవ్యవధిలో చెక్కులు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తన్నారు.

అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 801 మంది లబ్దిదారులకు 8,01,92,916 కోట్ల రూపాయల విలువ గల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now