నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 11:
బాసర ట్రిపుల్ ఐటీ లో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోతే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయలపలైన ఎం. సాయి కుమార్ ను నిజామాబాదు సివిల్ హాస్పిటల్ లో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు స్వాతిప్రియ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
బాసర IIIT ఆత్మహత్యలకు అడ్డాగా మారిన పరిస్థితి ఉందని బాసర వరుస ఆత్మహత్యాల వెనుక ఉన్న కారణాలు నిర్దారించడానికి విచారణ కమిటీ వేయాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని వాటికీ కారణం అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి గుండాలుగా వ్యవహరించిన పోలీసులను సెక్యూరిటీ సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలి దీనికి బాధ్యులైన సీఐ రాకేష్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్, అడ్వకేట్ జగన్ మోహన్, శ్రీకాంత్, ఆనంద్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.