తిరుమల శ్రీవారిని దర్శించుకున్న – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలుగు ప్రజలందరు భక్తి, శ్రద్దలతో పవిత్రంగా ఈ వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారని అన్నారు, మహావిష్ణుమూర్తి స్వయంగా గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకనికి వచ్చి దర్శనం ఇస్తాడనేది ప్రజల విశ్వసం అన్నారు మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు, అర్జునునికి గీత బోధించిన రోజుగా కూడా భావిస్తారని అన్నారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందున దీనిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారన్నారు.

ముక్కోటి దేవతల ఆశీర్వాదం తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలుపుతు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment