ప్రెస్ క్లబ్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ప్రత్యేక పూజలు

ప్రెస్ క్లబ్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ప్రత్యేక పూజలు

(ప్రశ్న ఆయుధం )సెప్టెంబర్ 5 నిజామాబాదు

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల కాలంలో హిందువుల ఐక్యత కోసం గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి జనసమీకరణ చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. నేడు దేశంలో వాడ చూసిన గణపతి మండపాలతో కళకళలాడుతున్నాయన్నారు.

ప్రతినిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే జర్నలిస్టులు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులు విశేష పూజలు జరిపించిన పూజారి నరసింహమూర్తిని శాలువతో సత్కరించారు. తొమ్మిది రోజుల ఉత్సవాలలో సేవలందించిన గణపతి పూజా కమిటీ, ఫుడ్ కమిటీ, డెకరేషన్ కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రెస్ క్లబ్ గణేష్ లడ్డూ వేలం జరిగింది. ఈ లడ్డు వేలంలో సిరిగాధ ప్రసాద్ ( చట్టం )12500 రూపాయలు పాడి ప్రెస్ క్లబ్ లడ్డును దక్కించుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment