నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 08:
నిజామాబాద్ అంబేద్కర్ భవన్ లో భారతీయ జనతా పార్టీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి జయంతి ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సమస్త మానవాళికి ఆ శ్రీరాముని జీవిత చరిత్ర ఆదర్శం అని ఆ శ్రీరాముని జీవనయనమే రామాయణం అన్నారు ఆ మహాగ్రంధమే లేకుంటే రాముడేవరో మనకు తెలిసేది కాదని అలా తెలిసేలా రామాయన గ్రంధాన్ని రచించిన మహాపురుషుడె వాల్మీకి అన్నారు. వాల్మీకి రాసిన రామాయణాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడుస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఆ మహనీయుని జయంతి సందర్బంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితిసే కార్యక్రమాన్ని తీసుకున్న SC మోర్చా జిల్లా కమిటీని అభినందించారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు విద్య అనేది ఒక విలువైన సంపద అని విద్యతో పాటు వినయం, విధేయత చాలా ముఖ్యం అని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా, సంస్కృతిక, కళ రంగాలలో కూడా రాణించాలని అన్నారు, అటువంటి నైపుణ్యలను పెంపొందించుకొని విద్యార్థులు భవిష్యత్తును ఉన్నత లక్ష్యం చేరుకునేలా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు.
మనమందరం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భవితరాలకు వాటిని అందించాలని సూచించారు. అనంతరం వివిధ పోటిల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నాగోళ్ళ లక్ష్మీనారాయణ, దేవర్ సంజు, పవర్ సాయినాథ్, బోత్ శేఖర్ ముత్యాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.