నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 26:
నిజామాబాద్ నగరం సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నియోజకవర్గంలో వివిధ అనారోగ్యంతో బాధపడ్డ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కోసం సీఎం సహానిధి ధ్వరా 132 మంది లబ్దిదారులకు 30,50,600 రూపాయల సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందించడం జరిగిందన్నారు.
భాదితుల నుండి వస్తున్నా దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయ నిధికి వెంటనే పంపడం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా మరియు బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్న కారణంగా పేద మధ్యతరగతి బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందన్నారు.
జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని నేరుగా కలిసిన సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం, దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% చెల్లించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజలకు నాణ్యమైన విద్య & వైద్యం అందించడమే మొదటి లక్ష్యం అని రాబోయే రోజుల్లో నిజామాబాదు ప్రభుత్వం హాస్పిటల్ ను అదునాతన సౌకర్యాలతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.