పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే 

నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్జ,జనవరి 17

సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించిన -ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ 35వ డివిజన్ శివాజీ విగ్రహం జైన్ మందిర్, 36వ డివిజన్ చత్రపతి హనుమాన్ మందిర్ వద్ద ,37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం వద్ద లో మరియు 43 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , మున్సిపల్ నగర మేయర్ నీతు& కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 14th ఫైనాన్స్ ధ్వరా ప్రతి డివిజన్ కు పదిలక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగింది.

నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు వంద కోట్లు మంజూరు చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి , ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 35 వ డివిజన్ ఎర్రం సుధీర్ , 36 వ డివిజన్ మాస్టర్ శంకర్ ,37 వ డివిజన్ ఉమా రాణి,ముత్యాలు ,43 వ డివిజన్ స్రవంతి రెడ్డి , స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now