పాలజ్ గణపతిని దర్శించుకున్న – అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం)సెప్టెంబర్ 3
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన *పాలజ్ కర్ర గణపతిని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ* దర్శించుకొని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సర్వజనిక్ గణేష్ మండలి ఆలయ పూజరులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు”కర్ర గణపతి ఆలయం నేటికీ ఎన్నో తారాలుగా భక్తుల నమ్మకానికి కేంద్రబిందువుగా నిలుస్తూ ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల ఆకాంక్షలను కోరికలను తీరుస్తుందని అన్నారు.
పాలజ్ ప్రాంతంలో ఏడు దశబ్దాల క్రితం విషవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన నిర్మల్ జిల్లా కొయ్యబొమ్మల కళాకారుడుచే ఒకే చెక్కతో గణపతి తయారు చేసి పూజించడం అది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గర్వకారణం అన్నారు.
కర్ర గణపతి ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని అన్నారు గణపతిని 11 రోజులు భక్తి శ్రద్దలతో పూజిస్తే ఎటువంటి విషవ్యాధులు దరికి చేరవణి ప్రజల విశ్వసం అన్నారు.
ప్రజలు భక్తి శ్రద్దలతో కర్రగణపతిని పూజించి నిమజ్జనం చేయకుండా ఊరేగించి ఒక గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
కర్ర గణపతి ఆశీర్వాదంతో దేశ & రాష్ట్ర ప్రజలదరు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు అనుకూల వర్షాలు పడి పాడి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.