Site icon PRASHNA AYUDHAM

హౌసింగ్ బోర్డ్ స్థలాలను ఇష్టారాజ్యంగా వేలం వేస్తామంటే ఊరుకోం జనసేన నాయకులు : ప్రేమ కుమార్

IMG 20250725 WA0054

హౌసింగ్ బోర్డ్ స్థలాలను ఇష్టారాజ్యంగా వేలం వేస్తామంటే ఊరుకోం జనసేన నాయకులు : ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం జులై25: కూకట్‌పల్లి ప్రతినిధి

కెపిహెచ్బి కాలనీ ఐదవ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ నందు కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతు పేద ప్రజల సౌలభ్యం తో దేవాలయాలకు, పాఠశాల కొరకు ,ఆట స్థలాల కొరకు , 10% స్థలాన్ని కేటాయిస్తూ ఆనాడు ప్రభుత్వం హౌసింగ్ బోర్డ్ ద్వారా ఎకరాలలొ ల్యాండ్ పులింగ్ చేసి ఇడబ్ల్యుఎస్ ,హెచ్ఐజి,ఎల్ జి,ఎంఐజి రూపేనా వివిధ కేటగిరీల ఇల్లు కట్టించి ప్రజలకు అనుకూలమైన ధరలకు ఇన్స్టాల్మెంట్ లొ అలాట్మెంట్ చేశారు , ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ అధికారులు స్థలాలను ప్రవేట్ వ్యక్తులకు వేలం ద్వారా కమర్షియల్ చేసి అమ్ముకొని డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు ఇది దారుణం , హౌసింగ్ బోర్డ్ లో మిగిలిన ఎకరాల స్థలాలను పాత పద్ధతిలో వివిధ కేటగిరీలలొ అన్ని సౌకర్యములతో ఇల్లు కట్టించి అనుకూలమైన ధరలతొ ప్రజలకు అలాట్మెంట్ చేయవలసిందిగా జనసేన తరపున హౌసింగ్ బోర్డ్ అధికారులను కోరుతున్నాం అన్నారు . ఇప్పటివరకు వేలం ద్వారా వచ్చిన ధనమును కొంత శాతం హౌసింగ్ బోర్డ్ కాలనీ డెవలప్మెంట్ కొరకు వాడాలని , ఏసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి ఆటస్థలం లేదని , కైలాపూర్ గ్రౌండ్ ని పిల్లల ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో కేటాయించాలని కోరుతూ , పేద ప్రజల శుభకార్యాలకై కేటాయించిన ఫంక్షన్ హాల్ ని కూడా వేలం వేయడానికి హౌసింగ్ బోర్డ్ అధికారుల ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది అట్టి దారుణం జరిగినచో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్ ,వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్ ,అంజి , సుంకర సాయి, బండిరెడ్డి క్రాంతి , పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version