ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ సూచన

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ సూచన

ఉపాధి హామీ పథకం పనుల జాతర జిల్లావ్యాప్తంగా ఘనంగా

కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తిమ్మాజివాడి గ్రామంలో పశువుల షెడ్డు ప్రారంభం

ఇంకుడు గుంతలు, నాడెపు కంపోస్టు నిర్మాణాలు ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష, ఇసుక–మెటీరియల్ కొరత రాకుండా చర్యలు

ఎక్కువ పని దినాలు చేసిన ఉపాధి హామీ కూలీలకు సన్మానం

ప్రశ్న ఆయుధం ఆగష్టు 22కామారెడ్డి:

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉపాధి హామీ పనుల జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తిమ్మాజివాడి గ్రామంలో పాల్గొన్నారు. చాకలి ఎంకవ్వ పశువుల షెడ్డు ప్రారంభించి, చెక్కు రూపంలో పేమెంట్ అందజేశారు. పాడిపశువులు ఉన్న రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని మరిన్ని షెడ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.

అలాగే గ్రామంలో ఇంకుడు గుంతలు, నాడెపు కంపోస్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకి, భూగర్భజలాలు పెరగడం రైతులకు ఎంతగానో ఉపయోగకరమని కలెక్టర్ వివరించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, ఐకేపీ ద్వారా లోన్ మంజూరు చేసి ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మెటీరియల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తరువాత జరిగిన గ్రామసభలో ఉపాధి హామీ పనులపై సమీక్ష చేసి, ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన కూలీలు, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు.

జిల్లా వ్యాప్తంగా 57 గ్రామపంచాయతీ భవనాలు, 50 అంగనవాడి భవనాలు, 134 స్కూల్ టాయిలెట్లు, 3 ప్లాస్టిక్ వ్యర్థాల యూనిట్లు, 3 కాంపోస్టు షెడ్లు, 19 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, 400 పశువుల షెడ్లు, 21 గొర్రెల–మేకల షెడ్లు, అజోల్లా పెంపకం, పౌల్ట్రీ షెడ్లు, ఉద్యాన తోటల పెంపకం వంటి పనులు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సంగ్య నాయక్, మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీవో శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment