ఫార్మర్ రిజిస్టరీ తో రైతులకు ఉపయోగం

ఫార్మర్ రిజిస్టరీ తో రైతులకు ఉపయోగం

ప్రశ్న ఆయుధం మే 6 కామారెడ్డి దోమకొండ.

దోమకొండ మండలంలోని రైతు వేదికలలో ఫార్మర్ రిజిస్టరీ రైతు గుర్తింపు కార్డుల ప్రక్రియ దోమకొండ లోని రైతు వేదికలో మంగళవారం నుండి వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. ఇందులో రైతులు యొక్క పాస్ బుక్కు, ఆధార్ కార్డు లింక్ రిజిస్ట్రేషన్ జరుగుతుందనీ వ్యవసాయ అధికారి దీపికా తెలిపారు. దీనివలన రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా రైతులకు కార్డు వారి యొక్క పాసుబుక్కు నంబరు తో కార్డు వస్తుందన్నారు. దానిలో అన్ని రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ కార్డులో ఉంటుందని, ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మన దీపిక, ఏ ఎస్ ఓ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని దోమకొండ మండల వ్యవసాయ అధికారులు ప్రశ్న ఆయుధం కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now