ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఉపయోగించుకోండి

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

ప్రశ్న ఆయుధం 21జులై హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమై ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గోదావరి ఉద్ధృతి వల్ల అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ, ఎన్ డి ఆర్ ఎఫ్, బృందాలను వినియోగించుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now