*ఆర్థిక సహాయం అందజేసిన ఉత్తునూరి రవి పాటిల్*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 12
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన రాయల శ్రీనివాస్ గత 4 నెలలు గా అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షలు వరకు ఖర్చు చేయడం జరిగింది. వారి కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదని తెలుసుకొని టేక్రియల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉత్తునూరి రవి పాటిల్ తన వంతు సహాయం గా 10000/- ల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.వారి కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ సలహాదరులు మహ్మద్ షబ్బీర్ అలీ కి తెలియజేసి ప్రభుత్వ పరంగా వారికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని వారి కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉత్తునూరి రవి పాటిల్, పెద్ద పోతన్నగారి రాజేష్, కుర్మ మనోహర్, వారి కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.